సిలువ గురించి 10 ముఖ్యమైన సత్యాలు

 

క్రీస్తు సిలువ వెనుక ఉన్న దేవుని ఉద్దేశం అర్ధం చేసుకోవడం మనకు చాలా ప్రాముఖ్యం, మరిముఖ్యంగా అబద్ద బోధలు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో.

క్రీస్తు సిలువ గురించి ఎప్పుడైనా నిజంగా ఆలోచించావా?


మన విశ్వాసానికి చాలా ముఖ్యమైన అంశం ఇది. దీని గురించిన అద్భుతమైన వివరాలు కొన్ని చూద్దాం. లేఖనాలు దీని క్రింద చూడండి.


1. అది ఒక ప్రమాదం కాదు. అది దేవుని ప్రణాళికలో ఒక భాగం.


2. దీని గురించి ముందుగానే చెప్పబడటం,రక్తంతో కూడిన బలుల యొక్క ఛాయలు, పాత నిబంధనలో కనబడుతుంది.


3. క్రీస్తు, సిలువ యొద్దకు స్వచ్ఛందంగా వెళ్లారు.


4. సిలువపై క్రీస్తు యొక్క మరణం, మనపై దేవుని ప్రేమను ఉద్దేశపూర్వకంగా చూపించడానికే.


5. సిలువపై క్రీస్తు యొక్క మరణం ఏదైతే సాధించిందో, వేరే ఏ విధంగానూ అది సాధ్యం కాదు. క్రీస్తు మరణించకపోతే, మన పాపాల్లోనే నిరీక్షణలేకుండా చనిపోయేవాళ్ళం.


6. క్రీస్తు యొక్క మరణం మరియు పునరుద్దానం, మన మరణాన్ని మరియు పునరుద్దానాన్ని సూచిస్తుంది.


7. సిలువను మోయడం మన విధేయతను చూపించడానికి, మన స్వార్థ కోరికలకు మనం చనిపోయాము అనడానికి ఒక గుర్తు.


8. సిలువపై క్రీస్తు యొక్క మరణం, కఠినమైనవి భరించడానికి మనకు స్ఫూర్తి.


9. క్రీస్తు యొక్క సిలువను బట్టి మనం ఆనందిస్తాం, అతిశయిస్తాం. ఎందుకంటే అదే మన రక్షణకు చిహ్నం.


10. అబద్ద బోధలు తరుచూ సిలువను తిరస్కరించడమో లేక దాని అర్ధాన్ని మార్చడమో చేస్తుంది.


ఈ క్రింది ఉన్న వాక్యాలు చదవడానికి కొంత సమయం తీసుకోవాలని మిమ్ములను ప్రోత్సాహిస్తున్నాను. క్రీస్తు సిలువను గురించి అర్ధం చేసుకోవడానికి సంఘ చరిత్రలో ఇది చాలా కీలకమైన సమయం. ఎందుకంటే అబద్ద భోధకులు, సిలువ ఒక మనుషులు చేసిన హింసకు గుర్తు మాత్రమే కాని మన విమోచనకు గుర్తు కాదు అని వాదిస్తారు.


ఈ క్రింది వాక్యభాగాలను మీ చిన్న గుంపులో లేక బైబిల్ స్టడీల్లో ఒకసారి ఎందుకు చదవకూడదు?


సిలువ


1. అది ఒక ప్రమాదం కాదు. అది దేవుని ప్రణాళికలో ఒక భాగం.


దేవుడు ఎవ్వరి పాపానికి కారణం కాదు, కనుక క్రీస్తును సిలువకు పంపడానికి యూదులను ఆయన ప్రేరేపించలేదు లేక రో్మీయులు క్రీస్తును సిలువ వేయడానికి దేవుడు కారణం కాదు. కాని ఏదైనా జరిగే ముందే అది జరుగుతుందని దేవునికి తెలుసు, ఆయన పాపపు చర్యలను కూడా మంచి ఉద్దేశాలకు ఉపయోగించగలరు. ఈ విషయాన్నే బైబిల్ అంతటిలో మనం చూడగలం (ఉదా : యోసేపు, దానియేలు, పౌలు..)


• దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. (అపో.కార్య. 2:23)


• ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. (కొలొస్సయులకు 1:19–20)


• అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తురక్తము వలన సమీపస్థులై యున్నారు. "ఆయన మన సమాధానమై యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును, తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను." "ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి," "తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు." (ఎఫెసీయులకు 2:13-16)


2. దీని గురించి ముందుగానే చెప్పబడటం,రక్తంతో కూడిన బలుల యొక్క ఛాయలు, పాత నిబంధనలో కనబడుతుంది.


• "మరియు ప్రతి యాజకుడు దిన దినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును."ఈయనయైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి,"అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు. (హెబ్రీ 10:11–14)


• మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. (యెషయా 53:5)


పూర్తి సందర్భం కోసం యెషయా 53:1-12.


3. క్రీస్తు, సిలువ యొద్దకు స్వచ్ఛందంగా వెళ్లారు.


• నేను నా ప్రాణాన్ని మళ్ళీ పొందడానికే దాన్ని పెడుతున్నాను, కాబట్టి నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను. (యోహాను 10:17–18)


• మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయుడై తన్ను తాను తగ్గించుకొనెను. (ఫిలిప్పీయులకు 2:8)


4. సిలువపై క్రీస్తు యొక్క మరణం, మనపై దేవుని ప్రేమను ఉద్దేశపూర్వకంగా చూపించడానికే.


• అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను (రోమా 5:8)


5. సిలువపై క్రీస్తు యొక్క మరణం ఏదైతే సాధించిందో, వేరే ఏ విధంగానూ అది సాధ్యం కాదు. క్రీస్తు మరణించకపోతే, మన పాపాల్లోనే నిరీక్షణలేకుండా చనిపోయేవాళ్ళం. అసలైతే దీనికే మనం అర్హులం. కాని దేవుని దయ వలన ఆత్మీయ మరణాన్ని మనం తప్పించుకున్నాం.


• దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను. (కొలస్సీ 2:14)


• పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను, ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు. (2 కొరింధీ 5:21)


• ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. (గలతీ 3:13)


• మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు. (1 పేతురు 2:24,25)


6. క్రీస్తు యొక్క మరణం మరియు పునరుద్దానం, మన మరణాన్ని మరియు పునరుద్దానాన్ని సూచిస్తుంది.


• నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. (గలతీ 2:20)


• ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయబడెనని యెరుగుదుము. (రోమా 6:6)


7. సిలువను మోయడం మన విధేయతను చూపించడానికి, మన స్వార్థ కోరికలకు మనం చనిపోయాము అనడానికి ఒక గుర్తు.


• తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. (మత్తయి 10:38)


• అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. (మత్తయి 16:24)


8. సిలువపై క్రీస్తు యొక్క మరణం, కఠినమైనవి భరించడానికి మనకు స్ఫూర్తి.


• మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. (హెబ్రీ 12:2)


• ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని (ఫిలిప్పీ 3:10,11)


9. క్రీస్తు యొక్క సిలువను బట్టి మనం ఆనందిస్తాం, అతిశయిస్తాం. ఎందుకంటే అదే మన రక్షణకు చిహ్నం.


• అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడి యున్నాము. (గలతీ 6:14)


10. అబద్ద బోధలు తరుచూ సిలువను తిరస్కరించడమో లేక దాని అర్ధాన్ని మార్చడమో చేస్తుంది.


• శరీర విషయమందు చక్కగా అగపడ గోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. (గలతీ 6:12)


• సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. (1 కొరింధీ 1:18)


10 Important Truths About the Cross


క్రీస్తు సిలువ వెనుక ఉన్న దేవుని ఉద్దేశం అర్ధం చేసుకోవడం మనకు చాలా ప్రాముఖ్యం, మరిముఖ్యంగా అబద్ద బోధలు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో.



పరిశుద్ధమైన ఆశ్చర్యం - యోహాను 1:27

 

నేను పరిశుద్ధమైన ఆశ్చర్యం అనే స్పృహను కోల్పోయానేమో అని అనిపిస్తుంది. బాప్తీస్మమిచ్చే యోహాను యొక్క పరిశుద్ధమైన ఆశ్చర్యం గురించి ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!

అద్భుతమైన క్రీస్తును, మనపై ఆయనకున్న ప్రేమను గ్రహించుట...


~ పరిశుద్ధమైన ఆశ్చర్యం అనే స్పృహను మనం కోల్పోయామా?


~ క్రీస్తు యొక్క దివ్యమైన మహిమ, శక్తి, ప్రేమ, పరిశుద్ధత, పరిపూర్ణతలు గురించిన దృక్పధాన్ని కోల్పోయామా?


~ మనం చూడలేనివి ఆయన చూస్తారని, మనం చిన్న భాగాన్ని చూస్తే, ఆయన పూర్తి చిత్రాన్ని చూడగలరనే కోణాన్ని చూడటం మనం కోల్పోయామా?


~ ఆయన మనలను తన స్నేహాతులని, అనుచరులని, బిడ్డలని పిలిస్తుంటే, వీటికి మనం అసలు అర్హులం కాదనే విషయాన్ని మనం మర్చిపోయామా? అవన్నీ ఆయన కృప ద్వారానే - అర్హత లేని మనకిచ్చే దయ, ప్రేమ వలనే వస్తాయి.


ఎవరైతే దేవునికి అమ్ముడుపోయి, విశ్వాసం నిమిత్తం హతసాక్షి అయ్యాడో, ఆ బాప్తీస్మం ఇచ్చే యోహాను ఇలా అన్నాడు :


యోహాను - నేను నీళ్ళలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీమధ్య ఉన్నాడు; "మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను.." యోహాను 1:27


స్వీయ కేంద్రీకృతమైన లోకంలో జీవిస్తున్న మనం దేవుని కృపను అర్ధం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. మనం ఎంత అర్హత లేనివాళ్ళమో అర్ధం చేసుకున్నప్పుడే, ఆయన ప్రేమ యొక్క తీవ్రతను అర్ధం చేసుకోగలం.


ప్రియ స్నేహితులారా, ఈ పరిశుద్ధమైన ఆశ్చర్యం అనే స్పృహ మనలో అభివృద్ధి కావాలని ప్రార్ధిద్దాం!


---------------------


* ఆరోజుల్లో, యజమాని చెప్పులు విప్పడం చాలా తక్కువ స్థాయిలో ఉన్న బానిస పని. కాబట్టి యోహాను ఏమంటున్నాడంటే తాను యేసయ్యకు తక్కువ స్థాయిలో ఉన్న బానిసగా ఉంటానికి కూడా అర్హుడు కాదు అని.


Holy Awe - John 1:27


నేను పరిశుద్ధమైన ఆశ్చర్యం అనే స్పృహను కోల్పోయానేమో అని అనిపిస్తుంది. బాప్తీస్మమిచ్చే యోహాను యొక్క పరిశుద్ధమైన ఆశ్చర్యం గురించి ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!




దైవిక నడిపింపు

దేవుడు ఇంకా కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతారా?


పాత నిబంధన కొత్త నిబంధనల్లో, దేవుడు కలల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడారు.


కాని ఈరోజుల్లో కూడా దేవుడు ఇంకా అలా చేస్తారా?


దీనికి క్లుప్తమైన జవాబు : దేవునికి ఏది చేయాలని అనిపిస్తే అది చేస్తారు.


ఆయన ఈరోజు కూడా కలలను, దర్శనాలను ఉపయోగిస్తారు, కాని మొదట సంఘ చరిత్రలో ఉన్నంత తరుచూగా కాదు.


ఎందుకు?


1. వాక్యం సంపూర్ణమైనది, అది సత్యానికి తిరుగులేని ఆధారం.


దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది. (2 తిమోతి 3:16-17)


2. ముఖ్యంగా, దేవుడు కలలను, దర్శనాలను ప్రవక్తలతో, అపొస్తలలతో మాట్లాడటానికి ఉపయోగించారు. ఎందుకంటే వారు సత్యాన్ని ఇతరులకు చేరవేస్తారని. ఆ సత్యమే లేఖనాలలో భాగమైనాయి. ఇప్పటి బోధకులు, పాస్టర్లు లేఖనాలను బోధించుట ద్వారా దేవుని సత్యాన్ని ఇతరులకు చేరవేస్తారు. రోమా 15:4, హెబ్రీ 4:12 చూడండి.


3. ఈరోజు, దేవుడు గనుక కలలు, దర్శనాల ద్వారా మాట్లాడితే, అది ఒక వ్యక్తికి గాని లేక ఒక గుంపుకు గాని లేక ఒక సంఘానికి గాని స్పష్టమైన ఆదేశం, నడిపింపు, హెచ్చరిక లేదా ప్రోత్సాహం ఇవ్వడానికే. అది వాక్యం కాదు (మొత్తం సర్వత్రిక సంఘానికి అని కాదు). పైగా వాటిని చాలా జాగ్రత్తగా పరీక్షించాలి (1). అపో. కార్యములు 10:1-15 చూడండి (2)


-------------------


(1) 1 కొరింధీ 14:29 సాధారణంగా ప్రవచనం గురించి చెప్పినా, అది కలలకు, దర్శనాలకు కూడా వర్తిస్తుంది.


(2) ఈ వాక్యభాగంలో, దర్శనాలు గురించి రెండు ఉదాహరణలు కనిపిస్తాయి : మొదటిది ఒక వ్యక్తికి ఒక ప్రత్యేకమైన పరిస్థితికి సంబంధించినదైతే, రెండవది ఒక అపొస్తులుడికి ఇవ్వబడింది. ఇది  క్రీస్తు శరీరమైన మొత్తం సర్వత్రిక సంఘానికి ఇవ్వబడిన ఆదేశం. మొదటి ఉదాహరణ ఈరోజు కూడా జరగొచ్చు. కాని రెండవ దర్శనం, లేఖనాలు ఎప్పుడైతే వ్రాయబడటం ముగిసిందో, దీనికి కూడా ముగింపు ఇవ్వబడింది.


Divine Guidance


దేవుడు ఇంకా కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతారా?


ఒక క్రైస్తవుడు దురాత్మతో నింపబడగలడా?

 

ఒక క్రైస్తవుడు దురాత్మతో నింపబడగలడా? అపవాదిని ఎదిరించుటకు 6 లేఖనాలు, ఇంకా ఎన్నో, ఈరోజు వాక్యధ్యానంలో!

ఈ ప్రశ్నను మనం దీనత్వంతో సమీపించాలి ఎందుకంటే దీనికి జవాబు లేఖనాలలో నేరుగా ఇవ్వబడలేదు, పైగా యదార్ధమైన, వాక్యాన్ని నమ్మే క్రైస్తవులు దీనికి జవాబుగా ఒకొక్కరు ఒకొక్క తీర్మానానికి వచ్చే అవకాశం ఉంది గనుక.


యేసు ప్రతీ క్రైస్తవునిలో నివాసం ఉంటారు, ఆయన అపవాది కంటే ఎంతో గొప్పవారు (1 యోహాను 4:1-6), అపవాది నుండి రక్షణ కల్పిస్తాననే దేవుని వాగ్దానం కూడా మనకుంది (2 థెస్స 3:3).


అయినప్పటికీ, మనం దేవుణ్ణి తృణీకరించుట ద్వారా దేవుని కాపుదల నుండి బయటకు నడిచి, అపవాదికి మన జీవితాల్లో చోటు ఇచ్చే అవకాశం ఉంది : అలా చేయకుండా అపవాదిని ఎలా ఎదిరించగలమంటే 


1. మన పాపాలు గురించి యదార్ధంగా పశ్చాతాపపడటం ద్వారా (యాకోబు 4:7-8).


2. నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండటం, విశ్వాసమందు స్థిరంగా ఉండటం ద్వారా (1 పేతురు 5:8,9).


3. ఇతరులను క్షమించుట ద్వారా (2 కొరింధీ 2:10,11)


4. సమయం మించక ముందే కోపంలో నిలిచి ఉండకకుండా జాగ్రత్త పడుట ద్వారా (ఎఫెస్సీ 4:26,27)


5. సర్వాంగకవచాన్ని ధరించుకొనుట ద్వారా (ఎఫెస్సీ 6:10-18)


6. మనలను మనం అన్య ఆచారాల నుండి, క్షుద్ర సంబంధిత వాటి నుండి వేరుచేసుకొనుట ద్వారా (2 కొరింథీ 6:14-17, అపో. కార్యములు 19:19)


దేవుడు యోబును పరీక్షించుటకు అపవాదికి అనుమతినిచ్చారని, పౌలును హెచ్చిపోకుండా ఉండేలా నలుగగొట్టుటకు కూడా అపవాదికి అనుమతినిచ్చారని మనకు బాగా తెలుసు (2 కొరింథీ 12:6-10) (1)


క్రైస్తవులు దురాత్మతో నింపబడతారు అని మనం ఖచ్చితంగా చెప్పలేము, కాని క్రైస్తవులు అపవాది చేత పరీక్షంపబడతారు, బాధింపబడతారు, శోధింపబడతారు, పీడింపబడతారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.


అపవాది తంత్రాలను ఎరిగినవారముగా మెలుకువ కలిగి ఉందాం. అపవాది యొక్క శోధనలను ఎదిరిద్దాం.

------------------


(1) పౌలు యొక్క పరిస్థితి గురించి పూర్తి వివరాలు మనకు ఇవ్వబడలేదు, కాని తను ఎన్నో శోధనలను, అనారోగ్య సమస్యలను, అపవాది వేధింపులను భరించాడని మనకు తెలుసు. 'సాతాను దూత' నుండి దేవుడు పౌలును విడిపించకపోయినా, జయకరంగా ఓర్చుకోవడానికి ఆయన శక్తిని మాత్రం ఖచ్చితంగా ఇచ్చారు (1 కొరింథీ 10:13).


Can a Christian Be Demon Possessed?


ఒక క్రైస్తవుడు దురాత్మతో నింపబడగలడా? అపవాదిని ఎదిరించుటకు 6 లేఖనాలు, ఇంకా ఎన్నో, ఈరోజు వాక్యధ్యానంలో!


ఎందుకు తగ్గింపు మనకు రక్షణ కవచం వంటిది

గర్వం మరియు తగ్గింపుకు మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం!


 ఇదివరకు, గర్వం, చెడు స్వభావానికి గుర్తుగా ఉండేది. "నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును" (సామెత 27:2) అనే సామెతను అన్యులు కూడా నమ్మేవాళ్ళు.


ఆధునిక ప్రజలు ఈ జ్ఞానాన్ని మర్చిపోయారు. అందుకే ఇప్పటి నటులు, సంగీతకారులు, రాజకీయనాయకులు, ఆటలు ఆడే వారు, రోజువారి ప్రజలు అహంకారంతో ఉండటంలో ఆశ్చర్యం లేదు.


క్రీస్తు అనుచరులు నేటి సమాజాన్ని కాక, దేవుని వాక్యాన్ని అనుసరిస్తారని నేను నమ్మి సంతోషిస్తున్నాను :


నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును. గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు. (సామెతలు 16:18-19)


క్రీస్తు అనుచరులమైన మనకు తెలుసు తగ్గింపు మనలను సరైన మార్గంలో నడిపిస్తుందని :


ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును. (సామెతలు 18:12)


మనకు తెలుసు చివరకు గర్వం కంటే తగ్గింపే మనకు ఎక్కువ మేలును తీసుకొస్తుందని :


"ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును" (సామెతలు 29:23)


అన్నింటికంటే ముఖ్యంగా మనకు తెలుసు "దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును" (యాకోబు 4:6) అని.


మన గురించి మనం ఎక్కువగా ఎంచుకోవడం చాలా సులువ, అందుకే దానివల్ల వచ్చే పర్యావసానాలు గురించి మనలను ప్రేమించే దేవుడు మనకు హెచ్చరికలు ఇచ్చారు. మనలను మనం ద్వేషించాలని ఆయన అడగట్లేదు లేక మన గురించి మనం హీనంగా ఆలోచించాలని కాదు. ఆయన ప్రణాళికలకు, ఉద్దేశాలకు, నియమాలకు మనం ఎంత నమ్మకంగా ఉన్నామో మన గురించి మనం సరైన అంచనా వేసుకోవాలని ఆయన ఆశిస్తున్నారు.


తన్నుతాను ఎంచుకొనతగిన దాని కంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధి కలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను (రోమా 12:3)


నిన్ను నువ్వు చూసే విధానంలో సరిచేసుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా?


Why Humility Is a Safeguard for Us


గర్వం మరియు తగ్గింపుకు మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం!



"ప్రతీరోజూ ఒకోరోజుగా" : బైబిల్ సూత్రం

రోజువారీ సవాళ్ళను ఎదుర్కోవడానికి మత్తయి 6 లో కొన్ని ముఖ్యమైన సూత్రలు ఉన్నాయి!


"ప్రతీరోజూ ఒకోరోజుగా" టీవి షాల్లో ఇది ఒక పాట. కాని ఇది మన రోజూవారీ ఒత్తిడిని ఎదుర్కోవడానికి బైబిల్ ఇచ్చే మంచి సూత్రం కూడా.


మత్తయి 6 లో మన రక్షకుని నుండి మనకు సహాయపడే అద్భుతమైన సలహా ఉంది. చింతించడం మరియు ప్రాధాన్యతలు గురించిన మాటతో అది ముగిస్తుంది.


రేపటినిగూర్చి చింతింపకండి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును (మత్తయి 6:34).


ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితానికి ఇది చాలా కీలకమైనది. అంతే కాకుండా దీనికి పై వచనంలో చాలా ముఖ్యమైన సత్యం ఉంది. "ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి" (మత్తయి 6:33).


సంబంధాల్లో ఉండే సంవత్సరానికి సరిపడా సమస్యలను 24 గంటల్లో వ్యవహరించగలమా? అలానే ఆర్ధిక సవాళ్ళు లేక ఆరోగ్య సమస్యల సంగతేంటి?


కీడు జరగకుండా మనం తప్పించుకోలేము కాని, దేవుని ఉద్దేశాలను వెదకడం ద్వారా, ఏరోజుకారోజు ఆయనను నమ్ముకోవడం వలన ఆందోళన నుండి మాత్రం తప్పించుకోగలము.


దేవునికి మన భవిష్యత్తు తెలుసు, మనకు జరిగే కీడును కూడా మన మేలుకై ఉపయోగిస్తారనే ఆయన వాగ్దానం మనకుంది (1 యోహాను 5:1-5; రోమా 8:28).


కనుక రేపు, ఆ తరువాత రోజు, అటు తరువాత రోజు దేవుని రాజ్య ప్రణాళికలను వెదకడానికి నిద్ర లేద్దాం. ఆ రోజుకు సరిపడా బలాన్ని, ధైర్యాన్ని దేవుడు ఇస్తారని నమ్ముదాం.


One Day at a Time: A Biblical Principle


రోజువారీ సవాళ్ళను ఎదుర్కోవడానికి మత్తయి 6 లో కొన్ని ముఖ్యమైన సూత్రలు ఉన్నాయి!



నీ షూస్ లోనే కాలు పెట్టు - ఎఫెసీ 2:10

ఇతరులలో దైవికమైన ప్రవర్తనను మాత్రమే అనుకరించాలని లేఖనాలు చెబుతుంటే, మనం ఇంకా దూరం వెళ్ళిపోతాం. దేవుడు మనం ఎలా ఉండాలని మనలను తయారు చేసారో అలానే ఉండాలని ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది!


 నా సూట్కేస్లో అవి సరిపోలేదు, అందుకనే నా షూస్ కొన్ని నా స్నేహితురాలికి ఇచ్చాను.


అవి ఆమె సైజు కాదు, కాని అవి దాదాపు కొత్తవి, దాదాపు ఆమె సైజే కాబట్టి అవి సరిపోతాయి అని అనుకుంది. కాని అవి ఆమెకు అంత సౌకర్యవంతముగా లేవు.


ఒక మధ్యాహ్నం అవి వాడుతున్న సమయంలో, దేవుడు ఆమె ఎలా ఉండాలని, ఆమె ఏమి చేయాలని కోరుతున్నారో అనే కొన్ని ప్రశ్నలతో ఆమె నిండిపోయింది. అలాంటి సమయంలో ఆమెకు ఒక వెలుగింపు కలిగింది : "వేరే వారిలా ఉండాలని ప్రయత్నించడం ఆపు. నువ్వు ఎప్పటికీ ఇతరుల షూస్ ని నింపలేవు" అని.


"ఆహా, ఇదేంత స్వాతంత్రాన్నిచ్చే క్షణం", అంది ఆమె. ఆమె సైజు దేవునికే తెలుసు. ఆమె కోసమే ప్రత్యేకంగా నిర్ణయించబడిన ప్రణాళికలు దేవునికున్నాయి (ఎఫెసీ 2:10).


నువ్వు కూడా వేరే వారిలా ఉండాలని కోరుకున్నావా : ఇంకా చిన్న వయస్సు ఉంటే, ఇంకా పెద్ద వయస్సు ఉంటే, పెళ్ళైతే, ఒంటరిగా ఉంటే, పొడుగ్గా ఉంటే, పొట్టిగా ఉంటే, లేక వేరే తలాంతులతో లేక సామర్ధ్య్యాలతో ఉంటే? అని 


ఇతరులలో ఉన్న దైవికమైన ప్రవర్తనను, విశ్వాస్యతను, భయభక్తులను అనుకరించవచ్చు కాని వారి వ్యక్తిత్వాలను కాదని, అలానే ఇతరుల జీవితాలను చూసి ఆశపడకూడదని దైవ లేఖనాలు చెబుతున్నాయి. (1 కొరింథీ 11:1, ఫిలిప్పీ 3:17).


ఒకొక్కరికోసమే ప్రత్యేకంగా దేవుడు ప్రణాళికలు రూపొందించారు.


కనుక నీ షూస్ లోనే కాలు పెట్టి, దేవుడు నీకిచ్చిన తలాంతులు, వ్యక్తిత్వం, ఎంత వరకు నువ్వు ప్రభావితం చేయడానికి ఆయన నిర్ణయించారో వీటన్నింటిని బట్టి ఆయన నిర్దేశించిన మార్గంలో నిన్ను నడిపించమని ఆయనను అడుగు.


Slip On Your Own Shoes – Ephesians 2:10


ఇతరులలో దైవికమైన ప్రవర్తనను మాత్రమే అనుకరించాలని లేఖనాలు చెబుతుంటే, మనం ఇంకా దూరం వెళ్ళిపోతాం. దేవుడు మనం ఎలా ఉండాలని మనలను తయారు చేసారో అలానే ఉండాలని ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది!


సిద్ధపడు : కుటుంబం నుండి హింస రావొచ్చేమో

క్రైస్తవ్యం అంటే మన సమాజంలో విరోధ భావం పెరిగిపోతుంది, కొంతమంది కుటుంబం నుండి తృణీకరణ అనుభవిస్తున్నారు, లోక మర్యాదను అనుసరించాలని ఒత్తిడికి గురి చేస్తూన్నారు.



 కొన్ని సంవత్సరాలక్రితం, జీవితంలో కొన్ని సవాళ్ల వలన ఫిర్యాదు చేసే సమయంలో యిర్మీయ 12:5-6 ద్వారా దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది.


5 వ వచనంలో, దేవుడు, ఫిర్యాదు చేయడం మానేసి, అధిక సవాళ్ళకోసం సిద్దపడుమని యిర్మీయాతో కవిత రూపంలో చెబుతారు.


తరువాత ఆరవ వచనంలో దేవుడు యిర్మీయా జీవితంలో ఒక బాధాకరమైన విషయాన్ని బయలుపరుస్తారు. "నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు; నీ వెంబడి గేలిచేయుదురు, వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు".


యిర్మీయ దైవికమైన వ్యక్తి, నైతిక విలువలు లేని రోజుల్లో దేవుని సత్యాన్ని నమ్మకంగా ప్రకటించిన వ్యక్తి. తన కుటుంబం తనను మోసం చేశారు, తనపై నిందలు వేశారు.


క్రైస్తవులు కొన్నిసార్లు "అత్యధిక ఆశావాదుల" మనస్తత్వం కలిగి ఉండటంలో అపరాదులు. ముఖ్యంగా కుటుంబానికి వచ్చేసరికి, ఎప్పుడూ ప్రతిదీ మంచిగా మారుతుంది అని ఆలోచిస్తారు.


కాని అలా జరగకపొతే? స్నేహితులను, కుటుంబాన్ని సంతోషపెట్టాలని మన విలువలను మార్చుకుంటామా? దేవుని ప్రేమతో నిండిన ఆజ్ఞలు గురించి చెప్పడం మానేస్తామా? సువార్త గురించి మన అవగాహన మార్చుకుంటామా?


యేసుని కూడా తన కుటుంబం తృణీకరించింది. మన బాధేంటో ఆయన అర్ధం చేసుకోగలరు (యోహాను 7:3-7).


మత్తయి 10 అధ్యాయంలో ఆయన తన శిష్యులను పంపేటప్పుడు ఒక హెచ్చరికనిస్తారు, మనం కూడా ఆ హెచ్చరికను తీసుకోవాలి. ఒకవేళ కుటుంబం మోసం చేసినా, ప్రపంచంమే వారిని చెడ్డవారు అని ముద్ర వేసిన, ఆత్మ నడిపింపుతో సత్యాన్నే పలకాలి అని ఆయన చెప్పారు (మత్తయి 10:16-39).


తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు (మత్తయి 10:37).


పెరగబోతున్న హింసలకు సిద్దపడాలి అనుకుంటే, మనం అత్యంత ప్రేమించేవారికంటే, యేసునే ఎక్కువ ప్రేమించాలి.



క్రైస్తవ్యం అంటే మన సమాజంలో విరోధ భావం పెరిగిపోతుంది, కొంతమంది కుటుంబం నుండి తృణీకరణ అనుభవిస్తున్నారు, లోక మర్యాదను అనుసరించాలని ఒత్తిడికి గురి చేస్తూన్నారు.


యెషయాకు తన గురించి తనకున్న అభిప్రాయం

యెషయా 6 వ అధ్యాయంలో, దేవుడు యెషయాను కలిసినప్పుడు, యెషయా చాలా ముఖ్యమైన విషయం ఒప్పుకున్నాడు.


చాలా మంది క్రైస్తవులకు యెషయా 6:8 బాగా పరిచయం ఉన్న వచనం. ఇందులో యెషయా "నేనున్నాను నన్ను పంపు" అని దేవునితో చెప్తాడు.


ఇందులో దేవుని పిలిపుకు యెషయా స్పందనను చూస్తాం, కాని ఈ ఆరో అధ్యాయం యొక్క పూర్తి సందర్భం మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం.


దేవుడు మొదటగా మాట్లాడినప్పుడు, యెషయా తను అర్హుడు కాదని భావించాడు. నిజమైన విశ్వాసానికి ఇది ఉండటం చాలా ప్రాముఖ్యం. దేశం నాశనాన్ని చూడటానికి, యెషయాకి వారు చేసే పాపంలో ఎటువంటి ప్రమేయం లేదు. లేదంటే దేవుడు తనకు కనిపించేవాడు కాదు. అయినప్పటికీ తాను ఎంతో పాపి అని గ్రహించాడు. తగ్గింపు, తన గురించి తనకున్న అవగాహన, దేవుని పనిని విశ్వాస్యతతో చేయడానికి చాలా అవసరం. దేవుని యొక్క పరిశుద్ధత, పరిపూర్ణత మనం నిజంగా అర్ధం చేసుకున్నప్పుడు, అలానే దేవుని వాక్యంలో ఉన్న నియమాలను కూడా నిజంగా అర్ధం చేసుకున్నప్పుడు, మన పాపాల విషయంలో మనం చాలా తీవ్రంగా వ్యవహరిస్తాం.


దేవుడు ఎప్పుడైతే తన పాపాలు కడిగివేయబడ్డాయి, తన హృదయం ఆయన ఎదుట సరైనదిగా ఉందని సంకేతాన్ని ఇచ్చారో, అప్పుడు యెషయా "నేనున్నాను నన్ను పంపు" అని చెప్పాడు.


చాలా మంది పాస్టర్లు, బోధకులు మంచి పునాదితోనే వారి పిలుపును మొదలుపెడతారు కాని కొంత దూరం వచ్చాక, గర్విష్టులుగా మారిపోతారు. వాళ్ళ వ్యక్తిగత పాపాలు గురించి పట్టించుకోవడం మానేస్తారు, దానివల్ల సేవలో నాశనాన్ని చూస్తారు.


ఎవరైతే బోధించడానికి అర్హత కలిగి, పాపానికి వ్యతిరేకంగా ఉన్న దేవుని తీర్పును గురించి ప్రకటిస్తారో, వారిని వారే ముందుగా తీర్పు తీర్చుకోవాలని వాక్యం చెబుతుంది (మత్తయి 7:1-5), వారే వారి వ్యక్తిగత పాపాలు గురించి ఎంతో జాగ్రత్త వహించి, ప్రార్ధనాపూర్వకంగా వ్యవహారించాల్సిన అవసరం చాలా ఉంది. ఫిలిప్పీ 2:12,13 దీనినే ఈ విధంగా వివరిస్తుంది "భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే."


దేవుడిని మన మాటలతోనే కాదు, మన జీవితంతో కూడా సంతోషపెట్టాలి అనే తీవ్రమైన కోరికను మనం ఎప్పుడు విడిచిపెట్టకుందుము గాక!


Isaiah's View of Himself


యెషయా 6 వ అధ్యాయంలో, దేవుడు యెషయాను కలిసినప్పుడు, యెషయా చాలా ముఖ్యమైన విషయం ఒప్పుకున్నాడు.



ఒక వెర్రివాడు, జ్ఞానవంతుడుగా ఎలా కనబడగలడో నీకు తెలుసా?

బైబిల్ దృక్పధం నుండి సమ్మతించని అనేక ముఖ్యమైన అంశాలను ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది. అలానే, ఒక వెర్రివాడు, జ్ఞానవంతుడుగా ఎలా కనబడగలడో అనే వివరణతో ఇది ముగిస్తుంది!


మనతో సమ్మతించే వారితో కలిసిపోవడం చాలా సులువే. కాని మనలో పరిపక్వత మరియు విశ్వాసపు నాణ్యత, మనతో సమ్మతించని వారిని బట్టే పరీక్షింపబడుతుంది (యాకోబు 1:2-5)


🩵 మనం వింటున్నామా?

సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును. (సామెతలు 18:13)


🩵 మనం మాట్లాడకముందు ఆలోచిస్తున్నామా?

నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును (సామెతలు 15:28)


🩵 మనం కృపాసహితంగా వ్యక్తపరుస్తున్నామా?

బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. (సామెతలు 18:6,7)


🩵 మనం తగ్గింపుతో మాట్లాడుతున్నామా?

అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును. (సామెతలు 21:24)


మన సంబంధాలలో ఈ క్రింది రెండు వచనాలు పాటిస్తే, ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.


🌟 ఫిలిప్పీయులకు 2:3,4 - కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు, మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.


🩵 చివరిగా, కేవలం మన అభిప్రాయాన్నే పంచుకోవాలని, ఇతరులపై ఆరోపణలు వేయాలని, లేక మనం చూసినట్టే ఇతరులు కూడా చూడాలని ఆజ్ఞాపించడానికే గనుక మనం చర్చలో పాల్గొనే వారమైతే, ఈ క్రింది వచనంలో నుండి ఆఖరి జ్ఞానయుక్తమైన మాటను మనం వినాలి :


ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును. (సామెతలు 17:28)


Do You Know What Makes a Fool Look Wise?


బైబిల్ దృక్పధం నుండి సమ్మతించని అనేక ముఖ్యమైన అంశాలను ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది. అలానే, ఒక వెర్రివాడు, జ్ఞానవంతుడుగా ఎలా కనబడగలడో అనే వివరణతో ఇది ముగిస్తుంది!


చెరశాలలో వర్ధిల్లడం లేదా స్వేచ్ఛలో సణగటం

కుటుంబం నుండి, బంధించిన వారి నుండి హింసింపబడినా, ఒక వ్యక్తికి జయించే విశ్వాసం ఉంటే, ఇంకో వ్యక్తి అసూయ వలన సణిగే బాధితుడిగా మారిపోయాడు!


ఈ భూమిపై న్యాయం పొందటం మన హక్కు అని ఎంత వాదించినా, దేవుని వాక్యం దానిని మనకి వాగ్దానంగా ఇవ్వలేదు (2 థెస్సలొనిక 1:6,7).


కాని మనం ఆత్మీయంగా వర్ధిల్లాలంటే, మనకి న్యాయం జరగాల్సిన అవసరమేమి లేదు.


కొన్నిసార్లు మనకు అన్యాయం జరగడం వలన అది మనలో గొప్ప ఎదుగుదలకు, సేవ బలపడటానికి  దారితీస్తుంది. దానికి మంచి ఉదాహరణ యోసేపు.


• కుటుంబం నుండి హింసింపబడ్డాడు - తన పై అసూయ ఉన్న తన అన్నలు తన ఏడుపును కూడా పట్టించుకోలేదు (ఆదికాండము 42:21).


• తనను భందించినవారి నుండి హింసింపబడ్డాడు - గొలుసులతో కట్టివేయబడటం, చెరసాలలో వేయబడటం, ఒంటరితనం (కీర్తన 105:17,18).


• పొతీఫరు భార్య ప్రతీకారంతో చెప్పిన అబద్దపు సాక్ష్యం వలన - సరైన పని చేసినందుకు చెరశాలలో వేయబడటం (ఆదికాండము 39).


~ నువ్వు కూడా నీ సన్నిహితుల వల్ల తీవ్రంగా గాయపరచబడ్డావా?


~ నువ్వు కూడా దుర్వినియోగించబడ్డావా, మోసగించబడ్డావా, హింసింపబడ్డావా?


~ నువ్వు కూడా సరైన పని చేసినందుకు అపనిందలపాలయ్యవా?


బహుశా యోసేపుకు లోతైన మానసిక, శారీరిక గాయాలు ఉండి ఉండవచ్చు (ఆదికాండము 43:30), కాని తాను వాటిని ఓడించాడు.


చెరశాలలో అతను వర్ధిల్లాడు :

1. దేవునికి ఒక ప్రణాళిక ఉందని నమ్మాడు (ఆదికాండము 50:20).

2. దేవుడు, ఇతరులు తనకు వ్యతిరేకంగా చేసిన పాపాలను కూడా తన మేలుకై వాడగలరని నమ్మాడు (ఆదికాండము 50:20).

3. దేవుడు, తన ప్రయత్నాలను ఆశీర్వదిస్తారు అని నమ్మి అన్ని సందర్భాలలో ఉన్నతంగా జీవించాడు (ఆదికాండము 39:2-6, 20-23, 41:41-44).


ఈరోజుల్లో ఉన్న సంస్కృతి, ఆధునిక సలహాదారులు, 'నువ్వు బాధితుడివి' అనే మనస్తత్వం చుట్టూ నీ జీవితాన్ని కట్టుకోమని ప్రోత్సాహిస్తుంటారు.


కయీనులాగ ఉండు అని మన సంస్కృతి మనల్ని ప్రోత్సాహిస్తుంది. కాని కయీనుకున్న ఈ బాధితుడిని అనే మనస్తత్వాన్ని జయించి, యోసేపులాగా ఉండటాన్ని ఎంచుకుందామా!


కుటుంబం నుండి, బంధించిన వారి నుండి హింసింపబడినా, ఒక వ్యక్తికి జయించే విశ్వాసం ఉంటే, ఇంకో వ్యక్తి అసూయ వలన సణిగే బాధితుడిగా మారిపోయాడు!


నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది

నువ్వు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే, "ఆకాశముకంటె ఎత్తయిన ఆయన కృపను" నువ్వు తెలుసుకోవాలని ప్రార్ధన చేస్తాను!


ఈరోజు ఉదయం 108వ కీర్తన చదువుతూ, నేను దావీదుకున్న విశ్వాసంతో సవాలు చేయబడ్డాను. తాను చాలా కఠినమైన పరిస్థితుల మధ్య కూర్చొని, దేవుడు వారి పోరాటంలో వారితో  లేడు, ఆయన వారిని తృణీకరించారేమో అనే భాధలో ఉన్నాడు (11 వచనం).


అయినప్పటికీ, దావీదు దేవునిపై నమ్మకాన్ని కలిగి స్తుతితో తన కీర్తనను మొదలు పెట్టాడు : "జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము". (3-5 వచనాలు)


దేవుని శక్తిపై నమ్మకంతో తన కీర్తనను ఇలా ముగించాడు "దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. (13 వచనం )


నేనేమి దేశాన్ని నడిపించట్లేదు, దావీదులాగా సైన్యాధిపతినేమి కాదు, కాని తనలాగా కఠినమైన సమస్యలలో కూర్చున్న అనేకమైన సమయాలు నా జీవితంలో చాలానే ఉన్నాయి.


ఇలా జరిగినప్పుడు, నాకు కూడా దావీదులాగా ఉండాలని ఉంది. ఆయనకున్న విశ్వాస్యతను ప్రేమను బట్టి దేవుని స్తుతుంచాలని, ఆయన శక్తిపై నమ్మకాన్ని పెట్టుకోవాలని ఆశపడుతున్నాను.


నా నమ్మకం దేవునిపైనే కాని మనుషులపై పెట్టుకోను (12 వచనం).


దేవుడు నా సమస్యల నుండి నన్ను విడుదల చేయకపోయినా, వాటి నుండి నడిపించడానికి నాతోనే ఉంటాడు అని నాకు నేను గుర్తుచేసుకోవాలని ఆశపడుతున్నాను. "ఆకాశము కంటే ఎత్తయిన" ఆయన కృపపై నేను ఆధారపడుదును గాక!


A Love that Is Higher than the Heavens, a Faithfulness that Reaches to the Skies


నువ్వు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే, "ఆకాశముకంటె ఎత్తయిన ఆయన కృపను" నువ్వు తెలుసుకోవాలని ప్రార్ధన చేస్తాను!


బిజీగా ఉండటం మనల్ని ముంచెత్తినప్పుడు

అతిగా బిజీగా ఉండటూ కొన్ని చేయి దాటిపోవనివ్వడం చాలా సులువే. కాని దానివల్ల దేవునికి మన యెడల ఉన్న ఉన్నతమైన ప్రణాళికలను పోగొట్టుకుంటాం. ఈరోజు వాక్యధ్యానంలో, దీని గురించే లేఖనాల నుండి నాలుగు సత్యాలు  నేర్చుకుందాం!


ఒక సాధారణ వారంలో, ఎంత తరుచూ నువ్వు చాలా బిజీగా ఉంటావు?


కొన్నిసార్లు పుట్టినరోజులు, సెలవులు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, జీవితంలో జరిగే మార్పులు మన ప్రణాళికలను స్వాధీనం చేసుకోవచ్చు. కాని జీవితం సాఫీగా ఉన్నాకూడా, ప్రాధాన్యతలు సరిగా పెట్టుకోలేకపోవడం వలన కూడా మనం బిజీగా ఉంటాం.


బైబిల్ నుండి ఈ క్రింది సత్యాలు మనకు సహాయపడతాయి :


• ఎఫెసీ 2:10 - మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు "ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు" చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. మనం ఒకొక్కరం చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. మనం ఇతర విషయాలతో బిజీగా ఉంటే, దేవుని ప్రణాళికలు పోగొట్టుకుంటాం లేదా అసంపూర్ణమైన హృదయంతో చేస్తాం. దేవునికి నీ యెడల ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని తెలుసుకోవడంలో నీకు ఆనందం లేదా?


• 1 పేతురు 4:10 - దేవుడు మనకు ప్రత్యేకమైన వరాలు ఇచ్చారు. "దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహనిర్వాహకులైయుండాలి". దేవుడు నీకు ప్రత్యేకమైన నైపుణ్యాలు ఇచ్చారని తెలుసుకోవడంలో నీకు ఆనందం లేదా?


• కొలస్సీ 3:23 - ఈ వచనం క్లుప్తమైన జవాబునిస్తుంది. మనం చేసే పని ఆయనకు అప్పగిస్తే, ఆయనే మన సమయాన్ని, బలాన్ని జ్ఞానంతో ఉపయోగించేలాగా నడిపిస్తారు. దేవుడే నీకు యజమాని అని తెలుసుకోవడంలో నీకు ఆనందం లేదా?


• యోహాను 15 లో మనం "బహుగా ఫలిస్తే" ఆయన మహిమ పరచబడతారు అని యేసు ప్రభువు చెప్పినప్పుడు దానికి అర్ధం అతిగా పనులు పెట్టుకోవడమని కాదు. దేవుడు ప్రత్యేకంగా మన కోసం రూపొందించి ఇచ్చిన నైపుణ్యాలను ఆయన చిత్తాలను నెరవేర్చడం కోసం నమ్మకస్తులముగా వాటిని వాడాలి అని ఆయన ఉద్దేశ్యం.


దానిలో భాగం, ఇంటిలో దేవుని ప్రణాళికను నెరవేర్చడం కోసం తల్లి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టడం కావొచ్చు. కుటుంబంతో, సంఘంతో ఎక్కువ సమయం గడపడం కోసం తండ్రి తన ఉద్యోగాలు మార్చుకోవడం కావొచ్చు. దీనర్ధం బిజీగా ఉండటాన్ని విడిచిపెట్టి, నీ జీవితంలో ప్రణాళికలు వేయడానికి దేవుణ్ణి అనుమతించడమే!


When Busyness Gets the Best of Us


అతిగా బిజీగా ఉండటూ కొన్ని చేయి దాటిపోవనివ్వడం చాలా సులువే. కాని దానివల్ల దేవునికి మన యెడల ఉన్న ఉన్నతమైన ప్రణాళికలను పోగొట్టుకుంటాం. ఈరోజు వాక్యధ్యానంలో, దీని గురించే లేఖనాల నుండి నాలుగు సత్యాలు  నేర్చుకుందాం!


కొట్టి, చెరశాలలో పడేసిన తర్వాత నువ్వు పాటలు పాడగలవా?

దేవుణ్ణి అధికంగా ప్రేమించిన కొంతమంది అద్భుతమైన సేవకుల గురించి తెలుసుకొని స్ఫూర్తిని పొందాలని ఆశపడుతున్నావా, అయితే ఈరోజు వాక్యధ్యానం చదువు!


134 వ కీర్తనలో కేవలం మూడు వచనాలు, యాభై మాటల కంటే తక్కువే ఉంటాయి. కాని మొదటి వచనంలోనే నేనొక అద్భుతమైన సత్యాన్ని కనుగొన్నాను :


యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి. (కీర్తనలు 134:1)


నిర్గమకాండము 27:20, 21 లో, ప్రత్యక్షపు గుడారం గురించి యాజకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఈ విధంగా ఉంది. "దీపము నిత్యము వెలిగించునట్లు... సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను"


ఈ వచనం అనేక ముఖ్యమైన బైబిల్ సత్యాలను గురించి నన్ను ఆలోచింప చేసింది :


🌟 మన జీవితం ఎంత చీకటిగా అనిపించినా, దేవుని వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగై ఉంది (కీర్తన 119:105).


🌟 యేసు ప్రభువు లోకానికి వెలుగై ఉన్నారు, ఆయనే మనలను చీకటిలో నడవకుండా కాపాడతారు (యోహాను 8:12).


🌟 క్రైస్తవులు ఈ చీకటి ప్రపంచానికి వెలుగై ఉంటూ దేవునికి మహిమ తేవడానికి పిలవబడ్డారు (మత్తయి 5:16).


చీకటిలో వెలుగు ప్రకాశించడం అనేదానికి ఒక అద్భుతమైన దృష్టాంతం అపో. కార్యములు 16 లో వ్రాయబడిన పౌలు సీలల పరిచర్యలో జరిగిన ఒక సంఘటనలో మనం చూస్తాం. వారు అన్యాయంగా కొట్టబడి, చెరశాలలో పడవేయబడ్డారు. కాని అంత చీకటి మధ్యలో, "అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి." (అపొ. కార్యములు 16:25).


దయచేసి కొంత సమయం తీసుకొని అపొ. కార్యములు 16వ అధ్యాయం చదవమని నా మనవి. "యెహోవా మందిరంలో దేవునికి రాత్రి సేవలు చేసే సేవకుల" గురించి ఒక అద్భుతమైన కధ అందులో వ్రాయబడి ఉంది.


ఈరోజు మన ప్రపంచం చీకటిలో ఉంది. దేవుని వాక్యం వెక్కిరించబడటం, పాపాన్ని పండుగ చేసుకోవడం, దేవుని బిడ్డలు అన్యాయంగా నిందించబడటం వంటివి.

మనం ప్రకాశించాలి, ప్రియ క్రైస్తవులారా, మనం ప్రకాశిద్దాం!


Would You Be Singing in Prison after a Beating?


దేవుణ్ణి అధికంగా ప్రేమించిన కొంతమంది అద్భుతమైన సేవకుల గురించి తెలుసుకొని స్ఫూర్తిని పొందాలని ఆశపడుతున్నావా, అయితే ఈరోజు వాక్యధ్యానం చదువు!


నీ విశ్వాసానికొస్తే, నువ్వు మొదటి కుమారుడివా లేక రెండో కుమారుడివా?

ఈరోజు వాక్యధ్యానం, మత్తయి 21 లో ఉన్న ఇద్దరు సహోదరుల గురించి ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తుంది!


మత్తయి 21:23-27 లో, పరిసయ్యులు యేసు యొక్క అధికారాన్ని ప్రశ్నించారు. వారి ప్రశ్నకు జవాబు చెప్పడం బదులు, ఆయన వారిని తిరిగి ఒక ప్రశ్న అడిగారు.


వారు దానికి సమాధానం ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వారు జవాబు చెబితే, క్రీస్తుకు అపకీర్తి తేవాలనే భక్తిహీనమైన వారి ఆలోచన బయటపడుతుంది గనుక.


దీని వెంటనే, నిజమైన విశ్వాసం అంటే ఏమిటి, బాహ్యంగా కనిపించే నకిలీ విశ్వాసం అంటే ఏమిటి అనే దానిని చెప్పడానికి యేసు ఒక కధ చెబుతారు (మత్తయి 21:28-32).


ఆ కథలో, ఒక తండ్రి తన ఇద్దరు కుమారులను తన ద్రాక్షాతోటలో పని చేయమని అడుగుతారు. అడిగిన వెంటనే నేను చేయను అని మొదటి కుమారుడు చెప్పి, వెంటనే తన మనసు మార్చుకొని చేస్తాడు. రెండవ కుమారుడు చేస్తాను అని చెప్పి, చెయ్యడు.


ఈ మొదటి కుమారుడిని, తమ పాపముల నుండి వెనక్కి తిరిగిన, పన్ను వసూలు చేసే వారితో, వేశ్యలతో, యేసు పోల్చారు. రెండవ కుమారుడిని ఎవరైతే దేవుణ్ణి సేవిస్తున్నామని చెప్పి తమను తామే సేవిస్తున్నారో ఆ పరిసయ్యులతో పోల్చారు.


మొదటి కుమారుడు మనస్సును ఉద్దేశాలను మార్చుకునే నిజమైన పశ్చాతాపానికి గుర్తుగా ఉన్నాడు.


రెండవ కుమారుడు సరైన మాటలు చెప్తాడు గాని చేసే వ్యక్తిగా ఉండని వానికి గుర్తుగా ఉన్నాడు.


మనం గనుక జాగ్రత్తగా లేకపోతే మనలో కూడా ఈ రెండవ కుమారుడు ఉండే అవకాశం ఉంటుంది. కనుక మన విశ్వాసం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఉండేలా జాగ్రత్త పడదాం!


When It Comes to Your Faith, Are You Like the First Son or the Second Son?


ఈరోజు వాక్యధ్యానం, మత్తయి 21 లో ఉన్న ఇద్దరు సహోదరుల గురించి ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తుంది!


మనకు అభిమానులు కాదు, స్నేహితులు అవసరం

నువ్వు వినడానికి ఇష్టం లేని వాటిని చెప్పే స్నేహితులను కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా? అటువంటి స్నేహితులను నీ జీవితంలోనికి ఎందుకు ఆహ్వానించాలో ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది!


"నిజమైన స్నేహితుడు నీ ముందే నిన్ను గాయపరుస్తాడు" - ఆస్కార్ వైల్డ్ 


• మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును. (సామెతలు 27:6)


స్వాభిమానం గురించి లోకం ఇచ్చే ప్రాధాన్యత, మనుషులలో అర్హత లేని మెప్పు కోసం ఆకలిని పుట్టిస్తుంది.


ఈ అర్హత లేని ధ్రువీకరణ అనే ఆహారం మనలను బద్ధకస్తులుగా, గర్విష్ఠులుగా, నిర్మాణాత్మక విమర్శను వ్యతిరేకించే వారిగా మార్చేస్తుంది.


నెమ్మదిగా స్నేహితులకు బదులు, అభిమానులను మన చుట్టూ పోగేసుకోవడం మొదలుపెడతాం.


విచారం ఏమిటంటే ఎప్పుడైతే సలహాలను తీసుకోవడానికి ఇష్టపడమో, ఎప్పటికి జ్ఞానవంతులంగా, దేవునిలో బలవంతులంగా ఎదగలేం. కేవలం మనల్ని మనం మోసం చేసుకుంటాం.


• నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. (సామెతలు 19:20)


• మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును. (సామెతలు 12:15)


• నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. (సామెతలు 1:8)


నిజమైన స్నేహితులు, మంచి తల్లిదండ్రులు, దైవికమైన పాస్టర్లు మనలను సవాలు చేస్తారు, సరి చేస్తారు.


మనకు నిజమైన స్నేహితులు అవసరం, కాని అభిమానులు కాదు.


We Need Friends, Not Fans


నువ్వు వినడానికి ఇష్టం లేని వాటిని చెప్పే స్నేహితులను కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా? అటువంటి స్నేహితులను నీ జీవితంలోనికి ఎందుకు ఆహ్వానించాలో ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది!


చేదు అనే విషాన్ని తాగడం మానేయడానికి నాలుగు మార్గాలు

చేదు అనేది విషం తాగడంతో సమానం. ఈరోజు వాక్యధ్యానం చేదు అనే విషాన్ని తాగడం మానేయడానికి నాలుగు మార్గాలు అందిస్తుంది.


"పగ అనేది నువ్వు విషం తీసుకొని, ఎదుటి వ్యక్తి చావాలని ఎదురుచూడటంలాంటిది"


నేను కూడా ఈ పగతో కొన్నిసార్లు పోరాటం చేస్తుంటాను. కాబట్టి ఈ పై కొటేషన్ నిజమే కదా అనిపిస్తుంది!


పగను గుర్తించే కొన్ని సూచనలు :


1. ఆ వ్యక్తి గురించి బాధ లేక కోపం లేకుండా ఆలోచించలేకపోవడం.


2. ఆ వ్యక్తికి ఏదైనా మంచి జరిగితే బాధ కలగడం.


3. నీ మనసులో ఆ వ్యక్తితో తరుచూ వాదించడం.


పగ అనేది ఆత్మీయంగా, శారీరికంగా, మానసికంగా మనలను విషపూరితం చేస్తుంది.


కాబట్టి ఈ పగ అనే విషాన్ని తాగడం ఎలా ఆపేయాలి?


1. అది విషం అని ముందు నమ్మాలి - అది సాతానుకు నీ హృదయంపై ఒక బలమైన పట్టునిస్తుందని అర్ధం చేసుకోవాలి (ఎఫెసీ 4:27).


2. ఆ నిష్ఫలమైన ఆలోచనలు మొదలైన వెంటనే నిన్ను గాయపరిచిన ఆ వ్యక్తి కోసం వెంటనే ప్రార్ధన చేయాలి (మత్తయి 5:44).


3. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొనే ప్రయత్నాలు ఆపేసి, దేవునితో నడుస్తూ ముందుకే సాగాలి (ఫిలిప్పీ 3:13,14).


4. సువార్త నిమిత్తం నీ కోరికలను విడిచిపెట్టడానికి ఇష్టపడాలి (ఫిలిప్పీ 2:5-7). దేవుడు తగిన సమయంలో ఆయన చిత్తాలను నెరవేరుస్తారు.


"కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము". (రోమా 12:21)


ఇవి చేయడానికి సహాయం చేయి ప్రభువా!🙏🏼


4 Ways to Stop Drinking the Poison of Bitterness


చేదు అనేది విషం తాగడంతో సమానం. ఈరోజు వాక్యధ్యానం చేదు అనే విషాన్ని తాగడం మానేయడానికి నాలుగు మార్గాలు అందిస్తుంది.


ఎటువంటి షరతులు లేకుండా యేసును ప్రేమించడం

ఎటువంటి స్వార్థపూరిత ప్రయోజనం కోసం కాకుండా యేసు ప్రేమించడమంటే ఏమిటి? ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


నా జీవితంలో, ఒక సమయంలో, యేసును యేసు కోసం కాదు, ఆయనిచ్చే ప్రయోజనాల కోసమే ప్రేమిస్తున్నాను అని గ్రహించాను. నిత్యజీవం నాకు సరిపోలేదు. ఇక్కడే, ఇప్పుడే ఇంకా నాకు వేరేవి కూడా కావాలి.


నేను ఈ కనువిప్పులోనికి రావడానికి కారణం, నా హృదయాన్ని కోసేసే, నా కలలను నాశనం చేసే, నా జీవిత గమనాన్నే ఎప్పటికీ మర్చివేసిన ఒకటి సంభవించడమే. అప్పుడు దేవునితో గొడవపడ్డాను. ఆయన నాకు ఇంకా ఋణపడ్డారు అని అనుకున్నాను.


యోహాను 6:26,27 లో ఉన్న గుంపు యేసును ఆతృతతో వెంబడించడానికి కారణం యేసు వారికిచ్చిన ఆహారాన్ని వారు ప్రేమించడమే కాని యేసు మీద ప్రేమతో కాదు. నేను కూడా వారిలో ఒకరిగా ఉన్నాను.


యేసుపై ప్రేమ, ఆయన గురించి సరైన అవగాహన నాకు లేదు అని ఎప్పుడైతే గ్రహించానో, నేను పశ్చాతాపపడ్డాను.


కాని అప్పుడప్పుడు ఈ అవలక్షణం నన్ను మరలా పలకరిస్తూ ఉంటుంది. అప్పుడు నా ఇహలోక జీవితంలో ఏమి సంభావించినా సరే, యేసు నా అర్హతకు మించి నాకు అన్నీ ఇచ్చారని మరలా నాకు నేను గుర్తుచేస్తుంటాను.


యేసును ఎటువంటి షరతులు లేకుండా మరి ఎక్కువగా ప్రేమించడానికి ఈరోజు నాతో కలిసి ఆయనను అడుగుదామా?


Loving Jesus No Strings Attached


ఎటువంటి స్వార్థపూరిత ప్రయోజనం కోసం కాకుండా యేసు ప్రేమించడమంటే ఏమిటి? ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!



భయము మరియు వణుకు లేక మాములుగా రాజీపడిపోవడమా?

మన రక్షణకు పనులు అవసరం లేదు అనే విషయాన్ని క్రైస్తవులు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


నీ భర్తను సంతోషపెట్టడం వెర్రితనం ఎందుకంటే నిన్ను అతను ఇప్పటికే ప్రేమిస్తున్నాడు కదా అని ఎవరైనా ఆమెతో చెబితే, ఆమె స్పందన బహుశా వికారంగా ఉంటుందేమో కదా..


కాని చాలా మంది క్రైస్తవులు మాత్రం, దేవుణ్ణి సంతోషపెట్టడం వెర్రితనం ఎందుకంటే ఆయన నిన్ను ఇప్పటికే ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పడం నేను విన్నాను.


మన ప్రస్తుత క్రైస్తవ సాంస్కృతి "పనుల రక్షణ" గురించి చాలా భయపడిపోయి, చెడుతో పాటు మంచిని కూడా పడేస్తున్నారు.


చెడు : మంచి పనులు మనల్ని రక్షించవు. రక్షించలేవు. కేవలం ఆయన కనికరం మీద ఆధారపడి మాత్రమే మనం ఆయన దగ్గరకు రాగలం.


మంచి : మనం రక్షణను కొనసాగిస్తాం (దేవునితో నడవడం ద్వారా) భయముతో వణుకుతో (ఫిలిప్పీ 2:12-13), దేవునికి ప్రీతికరమైనది ఏమిటో తెలుసుకుంటాం (ఎఫెస్సీ 5:10).


ఒక భర్త పెళ్లి చేసుకున్న తరువాత కూడా, పెళ్లి కాక ముందు ఒక్కడే ఉన్నప్పుడు ఎలా జీవించాడో అలానే ఇప్పుడు కూడా జీవిస్తే, అతను చెడ్డ భర్త.


మనం క్రీస్తు దగ్గరకు వచ్చిన తరువాత కూడా, రక్షణ పొందక ముందు జీవించినట్టే ఇప్పుడు కూడా జీవిస్తే, మనం చెడ్డ క్రైస్తవులం.


ఆయనను ప్రేమించినవారు ఆయనకు లోబడతారు (యోహాను 14:23).


దేవుని దయను, కృపను మనం సంపాదించలేం.


కాని విధేయతతో, ఉద్దేశపూర్వకంగా మన జీవితాలను జీవించాలి. ఇది పని కాదు - ఇది ప్రేమ.


Fear & Trembling or Casual Compromise?


మన రక్షణకు పనులు అవసరం లేదు అనే విషయాన్ని క్రైస్తవులు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!